Online Puja Services

వసంత నవరాత్రుల్లో చేసుకోదగిన శ్రీ దుర్గాకవచం.

3.144.151.106

సంకటాల నుండీ ముక్తినిచ్చే వసంత నవరాత్రుల్లో చేసుకోదగిన శ్రీ దుర్గాకవచం. 
- లక్ష్మి రమణ 

వసంత నవరాత్రుల్లో ఈ దుర్గా కవచం నిత్యమూ చదువుకోండి. లఘువుగా చేసుకోవాలి అనుకునేవారు, అమ్మవారి కృప దివ్యంగా ప్రభవించే ఈ శుభదినాలలో ఈ కవచాన్ని చేసుకోండి. దీన్ని ప్రతిరోజూ చేసుకోవడం వలన సర్వసంకటాల నుండీ విముక్తి లభిస్తుంది . అమ్మవారి రక్ష లభిస్తుంది . ఈ మాట స్వయంగా ఈశ్వరుడే చెప్పినటువంటిది . 

శ్రీ దుర్గా కవచం 

ఈశ్వర ఉవాచ ।
శృణు దేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదమ్ ।
పఠిత్వా పాఠయిత్వా చ నరో ముచ్యేత సంకటాత్ ॥ 1 ॥

అజ్ఞాత్వా కవచం దేవి దుర్గామంత్రం చ యో జపేత్ ।
న చాప్నోతి ఫలం తస్య పరం చ నరకం వ్రజేత్ ॥ 2 ॥

ఉమాదేవీ శిరః పాతు లలాటే శూలధారిణీ ।
చక్షుషీ ఖేచరీ పాతు కర్ణౌ చత్వరవాసినీ ॥ 3 ॥

సుగంధా నాసికం పాతు వదనం సర్వధారిణీ ।
జిహ్వాం చ చండికాదేవీ గ్రీవాం సౌభద్రికా తథా ॥ 4 ॥

అశోకవాసినీ చేతో ద్వౌ బాహూ వజ్రధారిణీ ।
హృదయం లలితాదేవీ ఉదరం సింహవాహినీ ॥ 5 ॥

కటిం భగవతీ దేవీ ద్వావూరూ వింధ్యవాసినీ ।
మహాబలా చ జంఘే ద్వే పాదౌ భూతలవాసినీ ॥ 6 ॥

ఏవం స్థితాఽసి దేవి త్వం త్రైలోక్యే రక్షణాత్మికా ।
రక్ష మాం సర్వగాత్రేషు దుర్గే దేవి నమోఽస్తు తే ॥ 7 ॥

శుభం !!

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi