Online Puja Services

చండీ అనుగ్రహం కోసం సప్తశతిని పారాయణ చేస్తున్నారా ?

18.188.40.207

చండీ అనుగ్రహం కోసం సప్తశతిని పారాయణ చేస్తున్నారా ?
- లక్ష్మి రమణ 

చండీ సప్తసతి చదువుతుంటే, ఆధ్యాత్మిక మార్గంలో ఒక్కో మెట్టు ఎలా ఎక్కాలో క్లుప్తమైన సంకేతాలు లభిస్తాయి . ఆ సంకేతాలు గ్రహించడం అంత తేలికైన విషయం కాదు. వాటిని అనుసరించడమూ తేలికైన విధానము కాదు . వీలైనంతవరకూ ప్రయత్నించాలని సూచిస్తూ , పండితులైనవారు మనకోసం వాటిని విపులంగా అందించారు . వాటిని సేకరించి హితోక్తిని అనుసరించేవారి సౌలభ్యం కోసం ఇక్కడ పొందుపరుస్తున్నాం . 

1. మధు కైటబులు - తీపి, చేదు కలిగిన రుచికి ప్రతీకలు  : పొగడ్తలు/ విమర్శలని స్వీకరించి/స్పందించే విధానం లో పరిపక్వత. అలాగే, మంచి రుచి ఉన్న ఆహారాన్ని ఆస్వాదించడం, రుచి లేని పదార్ధాన్ని కూడా నిరసించకుండా స్వీకరించడం.

2. మహిషాసురుడు - దున్నపోతు : కోపం, ఆవేశం, సున్నితత్వం లేకపోవడం వంటి లక్షణాలు కలిగినవాడు . వీటిని సవ్యంగా, సంయమనం తోటి మాత్రమే పొందడం అభ్యాసం చేయాలి . తద్వారా గుణాలని అధిగమించాలి .  

3. ధూమ్రలోచనుడు - పొగలు కమ్మిన దృష్టి: అంటే సరైన బుద్ధి లేకపోవడం . బుద్ధికి  పొగలు కమ్మితే దూర/లోతైన ద్రుష్టి ఉండదు. మన ఆలోచనా విధానాన్ని సంస్కరించుకోవడం అభ్యాసం చేయాలి . 

పై మూడు అహిత శత్రువులు. క్రింది మూడు హిత ( మంచి గా కనబడతాయి) శత్రువులతో కలిగే అడ్డంకులు

1. చండ ముండులు

చండ : ఇష్టమైన విషయం మీద మన శక్తిని , సమయాన్ని వెచ్చించేసి మిగతావాటిని పట్టించు కోకుండా చేయడం. 

అంతర్గత సంఘర్షణ ( ముండుడు ) : నేను తీసుకున్న నిర్ణయం/వెళుతున్న దారి సరైనదేనా, ఇంకోలా చేస్తే సరిగ్గా ఉండేదా  అనుకుంటూ సంశయాత్మగా , మనః శాంతి లేకుండా ఉండిపోవడం.  అటువంటి సంశయాత్మక స్థితి నుండీ  బయటపడే ప్రయత్నం చేసి, పోరి నమ్మకాన్ని అమ్మ పాదాలమీద స్థిరపడేలా చేయాలి . 

2. రక్త బీజడు - కోరికలకు ప్రతీక . ఆయనకి ఉన్న వరం తెలుసుగా! ఒక్కొక్క రక్తపు బొట్టు నుండీ తనలాంటి మరో రక్తబీజుడు ఉత్పత్తి అవుతాడు . తీరే ప్రతి కోరిక నుండీ పుంఖాను పుంఖాలుగా కోరికలు ఉద్భవిస్తూనే ఉంటాయి. అంతం లేని వీటిని శక్తిమాత దయతో నిగ్రహించాలి . 

3. శుంభ నిశుంభులు  - ఇది మంచి, ఇది చెడు. ఇది శుభం, ఇది అశుభం అన్న స్థితిని దాటడం. సర్వం పరమాత్మ స్వరూపమే అనే స్థితికి చేరడం . 

ఈ ఆరు దాటిన తరువాత ( షట్ చక్రాలు) ఏడవ చక్రంలో ఉన్న శక్తిని (అమ్మవారిని) చేరుకుంటారు అని ఈ విద్య ఉద్దేశం.

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi