Online Puja Services

ఏ కులమూ మతమూ లేనప్పుడు దేశదేశాలూ కొలిచిన దైవం ఎవరు ?

3.138.116.20

ఏ కులమూ మతమూ లేనప్పుడు దేశదేశాలూ కొలిచిన దైవం ఎవరు ?
- లక్ష్మి రమణ 

పరమాత్మ ఒక్కరే ! ఏ రూపమూ లేని పరమాత్మ ఏ రూపంలో పూజిస్తే, ఆ రూపాన్ని పొంది సాక్షాత్కరిస్తారు. ఇది మన ఋషులు చెప్పినమాట ! మాట మాత్రమే కాదు, అంగీకరించవలసిన నిజం కూడా !! ప్రహ్లాదుడు ఒక్కడూ చాలడూ ఈ నిజాన్ని మనం అంగీకరించడానికి ? పోతన గారు  భాగవతంలో నరసింహుని ఉద్భవం  జరిగే ఘట్టాన్ని వివరిస్తూ, ఏ చోట నుండీ పరమాత్మ ఉద్భవించాలని ప్రహ్లాదుడు చెబుతాడోనని, సృష్టిలోని ప్రతి అణువులోనూ నరసింహుని రూపు దాల్చి నిండిపోయారట ! యెంత అద్భుతమైన భావనా చూడండి !! నరుడు, సింహ ముఖుడై , దైవం సాక్షాత్కరించడం , అది ఇంతకూ ముందెన్నడూ లేనిది . ఇక ముందుర జరగనిది !! దైవ లీలలు అలాగే ఉంటాయి . ఇక్కడ దైవం శివుడా విష్ణువో బ్రహ్మగారో లేక నారసింహుడో కాదు. ఆయన పరమాత్మ అంతే ! ఒక్కడే అయితే , ఆ ఈశ్వరుణ్నే అందరూ కొలవాలి కదా ! కుల మతాల కుమ్ములాటలేల ? అసలు ఆది కాలంలో ఇవ్వన్నీ పుట్టక ముందర, దేశదేశాలూ కొలిచిన దైవం ఎవరు ? 

"ఆకాషత్ పఠితం తోయం
యథా గచ్ఛతి సాగరం
సర్వదేవ నమస్కరం
కేశవం ప్రతి గచ్ఛతి "

ఆకాశంలో ఎక్కడి నుంచైనా వర్షంగా పడే నీరు చివరకు మహాసముద్రానికి చేరుకున్నప్పుడు, ఏదైనా దైవిక కోణాన్ని ఆరాధించడం, చివరికి ఆ పరమాత్మనే  (శివునినే) చేరుకుంటుంది. ఆ విధంగానే ప్రపంచమంతటా ఇటీవల తవ్వకాలలో బయట పడుతున్న శివ లింగాలు, ఎవరు అవునన్నా , కాదన్నా ప్రపంచమంతా విస్తరించిన సనాతన ధర్మ ప్రాభవాన్ని వివరిస్తున్నాయి . పరమాత్ముడైన ఈశ్వరుని చిహ్నమైన లింగారాధనని ప్రస్తుతిస్తున్నాయి. ఆ వివరాలలో మచ్చుకి కొన్నింటిని పరిశీలించండి . 

రోమ్ నగరంలో" ప్రియేపస్" పేరిట[తొలి పూజ చేయాల్సిన దేవుడని అర్ధం],యునాన్ లో ఫల్లూస్ దేవుడిగా, మిశ్ర దేశం[నేటి అమెరికా]లో ఈశి: పేరుతో ప్రతి ఫాల్గుణ మాసంలో లింగ పూజలు,శివ వసంతోత్సవాలు జరిగేవి. ప్రస్తుతం అవి మెక్సికన్ ఎడారులలో జీవించే ప్రజలకు పరిమితం అయినాయి."ఫల్లూస్" అనే పేరు సంస్కృతం లోని ఫలేశ నుంచి పుట్టినది. అంటే పూజ చేయగానే ఫలాన్ని ఇచ్చే దేవుడని అర్ధం. ప్రాచీన యూదుల లో కాథలిక్కు లు "బెల్ ఫెగో" పేరుతో శివలింగాన్ని అర్ధించేవారని వ్లుత్కారుడు అనే మహా ఋషి గ్రంధాల వలన బయట పడింది. ఈ గ్రంధాన్ని విగ్రహారాధనను ఖండించే ప్రొటెస్టెంట్లు ధ్వంసం చేసేశారు. ఈ బెల్ఫెగో ఎదుట నంది విగ్రహం కూడా ఉన్నాదని అయన రాయడం విశేషం. బెల్ ఫెగో అంటే బసవేశ్వర లింగ మూర్తి అని అర్ధం. 

పరం కమ్యూనిస్ట్ దేశమని పేరున్న రష్యాలో కమ్యూనిజమ్ వేళ్లూనక పూర్వం వరకు శివ లింగారాధన జరిగింది. అక్కడి శివుడి పేరు "ఒసిరిస్" . ప్రతి అమావాస్య రోజున వీరు లింగ పూజ చేసేవారని తెలుస్తోంది. విదేశీయుల లింగారాధన పూజ లను "ఫలిసిజం" అంటారు. వీరే మన దేశంలోని లింగధారులు, లింగాయితలు[ఎస్పీబీ], జంగమ దేవరలుగా వ్యవహరించబడుతున్నారు. అంటే వీరి తల,యద మీద లేదా,భుజానికి ఒక చిన్న శివలింగము ధరింపబడి ఉంటుంది. 

ఫణిస్సులు[ఫ్రాన్సు ] ఐబ్రోనీయులు[ఐరోపా జాతీయులు], బాణ లింగాన్ని పూజించేవారని బైబిల్ లోఉంది.బైబిల్ దీనిని బాలేశ్వర లింగమని పేర్కొన్నదిఅమెరికా లోని పెరువియ అనే ప్రాంతం లోని ప్రజలు శివుడి[లింగాన్ని] ని "సిబ్రు" పేరుతో పూజించేవారుట. సర్ జాన్ మార్షల్ చరిత్రకారుడు రచనల్లోఈ లింగారాధనం ప్రపంచంలో శిలా యుగం ముందు నుంచే ఉందని స్పష్టమైంది. ఈ విషయాలు అయన రాసిన లింగారాధనం అనే గ్రంధంలోవే.

మహమ్మద్ ప్రవక్త పుట్టక ముందు అరబ్ దేశాలలోని ముస్లింలు "లాత్ " అనే పేరున్న శివ లింగాన్ని పూజించేవారు. సోమనాధ ఆలయం లోని శివ లింగము,అరబ్ దేశాలలో పూజలందుకున్న శివ లింగము రెండూ ఓకే రాతితో మలచబడినవని 1729 లో ప్రచురితం అయిన రిచర్డ్ సన్స్ నిఘంటువు బట్టి తెలుస్తోంది. గజని మహమ్మద్ వచ్చిన తరువాత లాత్ అనేది ఒక చోట మాత్రమే ఉండాలనే ద్వేషంతో, మన దేశంలోని సోమనాధ ఆలయాన్ని ధ్వంసం చేసి, అక్కడి శివుని ధ్వసం చేయడమే కాక, లాత్ అంటే ప్రవక్త పెద్ద కూతురు పేరని చరిత్రలో ఒక అసత్యాన్ని ప్రచారం చేశారు. దీనికి రిచర్డ్ సన్ సాయం చేశాడంటారు. భవిష్య పురాణం లో మక్కా లో ని కాబా లో ఉన్నది లాత్ అనే శివలింగమే నని రాయబడింది. ఈ పురాణంలో దీనిని మక్కేశ్వర లింగమని పేర్కొనడం విశేషం. 

ఇజ్రాయెల్ యూదులు, ముస్లిం దేశాలవారు దీని "అస్వద్" అనే పేరుతో పూజిస్తున్నారు. అస్వద్ అనే పార్శీ-అరబ్బీ పదానికి పవిత్రమైన,పూజించదగిన అనే అర్ధాలున్నాయి.

చైనాలో శివ లింగ పూజలు జరిగిందనడానికి అక్కడి" హువేజ్హి ఫుహ్ "దేవుడు ప్రత్యక్ష్య నిదర్శన. శివలింగాన్ని వారు ఈ పేరుతో ఆరాధిస్తున్నారు. గ్రీసు లో ఒకప్పుడు లింగారాధనం" భూలాస్ " పేరిట జరిగేది. విషమిస్,సర్కిస్ దేశాలలోని అనేక ప్రార్ధనా మందిరాలలో ,టెలోస్ ,ఇటలీ,బురజో దేశాలలోని చర్చిల్ లో నేటికి ని శివలింగపు ఆనవాళ్లను చూడ వచ్చు. 

ఈ విధంగా నామ, రూప, గుణ విశేషాలు ఏవీ లేని అనంత శుద్ధ పరమాత్మని పూజించుకునే ఈ ప్రపంచం ఎవరి వల్ల చక్కటి ఇటువంటి కుమ్ములాటలు ఎదుర్కుంటోందో ఇప్పుడు ఆలోచించుకోవాలి .  

పరిశోధనాత్మకమైన సమాచారాన్ని సేకరించి సోషల్ మీడియాలో ప్రచురించి ఇచ్చినందుకు జర్నలిస్ట్ మిత్రులు చల్లా జయదేవ్ వర గారికి కృతజ్ఞతలతో!! 

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi