Online Puja Services

రోజూ ఈ చిన్న పూజ చేసుకుంటే, ఇక అన్నింటా విజయమే

3.144.86.134

రోజూ ఈ చిన్న పూజ చేసుకుంటే, ఇక అన్నింటా విజయమే !!
- లక్ష్మి రమణ 

ఈ జగతిలో కాలమే గొప్ప శక్తి అనుకుంటే, ఆ కాలమే తానై ఉన్నవాడు పరమేశ్వరుడు . ఆ రుద్రస్వరూపుడైన ఉమాకాంతుడిని ప్రదోషవేళలో శివ శతనామ స్తోత్రంతో అర్చిస్తే, అటువంటివారికి సాధ్యము కాని కార్యమే ఉండదని స్కాంద పురాణం చెబుతోంది. ఈ దివ్యమైన స్తోత్రం సేవ్ చేసి పెట్టుకోండి. ఇది అన్ని స్తోత్రాల్లా సులభంగా దొరికేది కాదు. ప్రతిరోజూ పూజా వేళలో పరమేశ్వరుడి ఒక్క బిల్వాన్ని అర్పించి ఈ స్తోత్రాన్ని చదువుకున్నా, పరమేశ్వర అనుగ్రహం సిద్ధిస్తుంది. 

శివ శతనామ స్తోత్రం
స్కాంద పురాణాంతర్గతం . 

నమో రుద్రాయ భీమాయ నీలకంఠాయ  వేదసే| 
కపర్దినే సురేశాయ వ్యోమకేశాయ వై నమః ||     1

వృషధ్వజాయ సోమాయ నీలకంఠాయ వై నమః 
దిగంబరాయ బర్గాయ ఉమాకాంత కపర్దినే||      2 

తమోమయాయ వ్యా ప్తాయ శిపివిష్టాయ వై నమః| 
వ్యాళ ప్రియాయ వ్యాళాయ వ్యాళానాం పతయే నమః|| 3

మహిధరాయ వ్యాఘ్రాయ పశూనాం పతయే నమః | 
త్రిపురాంతకసింహాయ శార్ధూలోగ్రరవాయచ|| 4 

 మీనాయ మీననాథాయ సిద్ధాయ పరమేష్ఠినే| 
కామాటకాయ బుద్దాయ బుద్ధీనాం పతయే నమః || 5

కపోతాయ విశిష్టాయ శిష్టాయ పరమాత్మనే | 
వేదాయ వేదబీజాయ దేవగుహ్యాయ  వై నమః|| 6

దీర్ఘాయ దీర్ఘ దీర్ఘాయ దీర్ఘార్ఘాయ మహాయ చ| 
నమో జగత్ ప్రతిష్ఠాయ వ్యోమరూపాయ వై నమః || 7

గజాసుర వినాశాయ హ్యందకాసుర బేధినే | 
నీలలోహిత శుక్లాయ చండ ముండ ప్రియాయ చ|| 8

 భక్త ప్రియాయ దేవాయ జ్ఞాన జ్ఞానావ్యయచ|
మహేశాయ నమస్తుభ్యం మహాదేవహరాయ చ|| 9

త్రినేత్రాయ త్రివేదాయ వేదాంగాయ నమో నమః | 
అర్థాయ అర్థరూపాయ పరమార్ధాయ వై నమః || 10 

విశ్వరూపాయ విశ్వాయ విశ్వనాథాయ వై నమః | 
శంకరాయ చ కాలాయ కాలావయవరూపిణే ||  11 

ఆ రూపాయ చ సూక్ష్మాయ సూక్ష్మసూక్ష్మాయ వై నమః | 
స్మశానవాసినే తుభ్యం నమస్తే కృత్తివాససే|| 12

 శశాంక శేఖరాయైవ రుద్రవిశ్వాశ్రయాయ చ | 
దుర్గ దుర్గసారాయ దుర్గావయవ సాక్షిణే || 13

 లింగరూపాయ లింగాయ లింగానాం పతయే నమః 
నమః ప్రణవ రూపాయ ప్రణవార్థాయ వై నమః|| 14 

 నమోన్నమః కారణ కారణాయ తే | 
మృత్యుంజయాయాత్మభావ స్వరూపిణే|  

త్రయంబకాయాసితకంఠ భర్గ| 
 గౌరీపతే సకల మంగళహేతవే నమః || 15


సర్వేజనా సుఖినోభవంతు !!

పరమేశ్వరానుగ్రహ సిద్ధిరస్తు !!

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore