Page 8 of 16 FirstFirst 12345678910111213141516 LastLast
Results 71 to 80 of 156

Thread: Bhadrachala Ramadasu keerthanalu lyrics in Telugu

          
   
 1. #71
  Super Moderator
  status.
   
  lakikishan's Avatar
  Join Date
  11th January 2012
  Posts
  8,961
  Rep Power
  247

  Ninu nammi yunnavaadanu (నిను నమ్మి యున్నవాడను)

  Ninu nammi yunnavaadanu (నిను నమ్మి యున్నవాడను)

  పల్లవి


  || నిను నమ్మి యున్నవాడను ఓ రామ ||


  చరణములు


  || నిన్ను నమ్మినవాడ పరులను వేడ నిక | మన్నన జేసి పాలింపవే ఓ రామ ||


  || బ్రతిమాలి వ్రతము చెడుటేగాని యిదేమి సుఖము | వెత నొందగ జాలనే ఓ రామ ||


  || మానము విడిచి కసుమాల పొట్టకొరకై | మానవుల వెంబడింతునే ఓ రామ ||


  || సతతము రక్షించు చతురత నీకున్నప్పుడు మరి | చంచలింప నేటికే ఓ రామ ||


  || సతతము భద్రాద్రి స్వామి శ్రీరామ దాస | పతివై నన్నాదరించవే ఓ రామ ||

 2. #72
  Super Moderator
  status.
   
  lakikishan's Avatar
  Join Date
  11th January 2012
  Posts
  8,961
  Rep Power
  247

  Nee sankalpam (నీ సంకల్పం)

  Nee sankalpam (నీ సంకల్పం)

  పల్లవి
  నీ సంకల్పం బెటు వంటిదో గన నెంత వాడరా రామ నీ
  వాసి తరిగి నీ దాస జనులు భువి కాశ పడిన యా ఘన మెవ్వరిదో నీ ||


  చరణములు


  1.బ్రోచిన మరి విడ జూచిన నీ క్రుప గాచి యుండు గాని
  తోచీ తోచకను తొడరి కరంబుల చాచి పరుల నే యాచన సేయను నీ ||


  2.పటు తరముగ నీ మటు మాయలకును నెటువలె నోర్తును
  చటుల తరంబుగ జలగు భవాంబుధి నెటు దాటుదు నేనెవరిని దూరుదు నీ ||


  3.భావజ రిపు నుత పరమ పురుష నీ భావము తెలియదుగ
  దేవ దేవ నీ సేవక జనులకు సేవకుడను నను గావుము మ్రొక్కెద నీ ||


  4.దరి జేర్చెదవని ధైర్యము చే నీ దరి చేరితిని గాని
  అరసి బ్రోవగదె యారడి పెట్టుట యెరుగ నైతి నా దొరవను కొంటి నీ ||


  5.శరణాగత రక్షణ భవ సాగర తరణ రిపు హరణ
  కరుణ జూదు భద్రాద్రి నివాసా అర మర చేయకు హరి నిను నమ్మితి నీ ||


  .

 3. #73
  Super Moderator
  status.
   
  lakikishan's Avatar
  Join Date
  11th January 2012
  Posts
  8,961
  Rep Power
  247

  Narulaara chedi (నరులార చేడి)

  Narulaara chedi (నరులార చేడి)

  పల్లవి
  నరులార చేడి పొయ్యెదరు నామసార మెరుగక మీరు ఓ


  చరణములు


  1.శాస్త్రాదుల బ్రమలో తగిలి మీ రపాత్రులైయుందురే గాక సత్పాత్రమును
  తెలియలేక అన్య తీర్థాలు యాత్రలు నెందుకు శుక శాస్త్రము తెలుసుకోక ఓ


  2.పక్షమును బూని కక్షుల జేరి మా రక్షకుని దలపలేరు బ్రహ్మ రాక్షసులై
  బుట్టెదరు మా లక్ష్మణాగ్రజుని వీక్షణ గల్గిన అక్షయపదమొందెరు ఓ


  3.బ్రహ్మమేకమని ధర్మము లుండగ కర్మమతులై పొయ్యెదరు ఆ మర్మము
  తెలియ జాలరు ఇమ్మహిలోపల దుర్మతులై బ్రహ్మమిది యదియని యల్లాడెదరు ఓ


  4.సోముడు రాముడు వేమారు జెప్పిన గాని యేమరు చున్నాను మీరు వారిద్దరు
  వేరును గారు సోముడే భద్రాద్రి రాముడని భజియించండి మీ అబ్బతోడు ఓ

 4. #74
  Super Moderator
  status.
   
  lakikishan's Avatar
  Join Date
  11th January 2012
  Posts
  8,961
  Rep Power
  247

  Narayana narayana jaya gopala (నారాయణ నారాయణ జయ గోపాల)

  Narayana narayana jaya gopala (నారాయణ నారాయణ జయ గోపాల)

  పల్లవి
  || నారాయణ నారాయణ జయ గోపాల హరే కృష్ణ ||


  చరణములు


  || శ్రీ కౌస్తుభమణిభూష శృంగార మృదు భాష ||


  || నంద వర కుమార నవనీత దధిచోర ||


  || కమనీయ శుభగాత్ర కంజాత దళనేత్ర ||


  || కరుణాపారవార వరుణాలయ గంభీర ||


  || మంజుల కుంజభూష మాయామానుష వేష ||


  || అజ భవనుత కంసారే అచ్యుతకృష్ణ మురారే ||


  || మురళీగాన వినోద వ్యత్యస్తా పాదారవింద ||


  || యమునాతీర విహార ధృత కౌస్తుభ మణిహార ||


  || వరభద్రాచలవాస పాలితరామదాస ||

 5. #75
  Super Moderator
  status.
   
  lakikishan's Avatar
  Join Date
  11th January 2012
  Posts
  8,961
  Rep Power
  247

  Narahari nammaka narulanu nammite (నరహరి నమ్మక నరులను నమ్మితె)

  Narahari nammaka narulanu nammite (నరహరి నమ్మక నరులను నమ్మితె)

  పల్లవి
  || నరహరి నమ్మక నరులను నమ్మితె | నరజన్మ మీడేరునా ఓ మనసా ||


  ఆనుపల్లవి


  || చెర్కకు లుండగ వెర్కిరి చెరకులు నమిలితె | జిహ్వకు రుచిపుట్టునా ఓ మనసా ||


  చరణములు


  || కాళ్ళుండగ మోకాళ్ళతో నడచితె | కాశికి పోవచ్చునా ఓ మనసా |
  నీళ్ళుండగ నుమ్మి నీళ్ళను మ్రింగితే | నిండు దాహము తీరునా ఓ మనసా ||


  || కొమ్మ యుండగ కొయ్య బొమ్మను కలిసితె | కోరిక కొనసాగునా ఓ మనసా |
  అమ్మ యుండగ పెద్దమ్మను యడిగితె | నర్థము చేకూరునా ఓ మనసా ||


  || అన్నముండగ గుల్ల సున్నము తింటే | యాకలి వెతతీరునా ఓ మనసా |
  కన్నె లుండగ చిత్ర కన్నెల గలసిన | కామపు వ్యధ తీరునా ఓ మనసా ||


  || క్షుద్రబాధలచే నుపద్రవ పడువేళ | నిద్ర కంటికి వచ్చునా ఓ మనసా |
  భద్రగిరీశుపై భక్తిలేని నరుడు | పరమును గన నేర్చునా ఓ మనసా ||


 6. #76
  Super Moderator
  status.
   
  lakikishan's Avatar
  Join Date
  11th January 2012
  Posts
  8,961
  Rep Power
  247

  Narahari devaa (నరహరి దేవా)

  Narahari devaa (నరహరి దేవా)

  పల్లవి
  నరహరి దేవా జనార్ధనా
  కేశవ నారాయణ కనకాంబర ధారీ
  రామ రామ శ్రీ రఘు రామ రామ రాం


  అనుపల్లవి


  రవి కులాభరణ రవి సుథ సఖ్య
  రాక్శస సమ్హార రాజ సేవిత
  రామ రామ శ్రీ రఘు రామ రామ రాం
  (నరహరి)


  చరణములు


  1.పన్నగ సయన పతిత పావన
  కన్నతండ్రి ఓ కరుణా సాగర
  బంధు జనక త్రిపురాంధ సాయక
  సీతా నాయక శ్రీ రఘు నాయక


  2.సుందర స్రిధార మంధ్రోద్ధార
  మకుట భూషన మ్రిదుపక్షక హరి
  నంద నందనా నంద ముకుందా బ్రింధావన విహారీ గోవింద


 7. #77
  Super Moderator
  status.
   
  lakikishan's Avatar
  Join Date
  11th January 2012
  Posts
  8,961
  Rep Power
  247

  Nannu brovumani (నన్ను బ్రోవుమని)

  Nannu brovumani (నన్ను బ్రోవుమని)

  పల్లవినన్ను బ్రోవుమని చెప్పవే సీతమ్మ నను బ్రోవుమని చెప్పవే
  అనుపల్లవి
  నన్ను బ్రోవుమని చెప్పు నారీ శిరోమణి జనకుని కూతుర జనని జానకమ్మ
  చరణములు
  1.ప్రక్కన జేరుక చెక్కిలి నొక్కుచు చక్కగ మరుకేళి చొక్కియుండేడు వేళ
  2.లోకాంతరంగుడు శ్రీకాంత నిను గూడి ఏకాంతముననేక శయ్యనున్న వేళ
  3.అద్రిజ వినుతుడు భద్రగిరీశుడు నిద్రమేల్కొను వేళ నెలతరో బోధించి


 8. #78
  Super Moderator
  status.
   
  lakikishan's Avatar
  Join Date
  11th January 2012
  Posts
  8,961
  Rep Power
  247

  Nandabalam Bhajare (నందబాలం భజరే)

  Nandabalam Bhajare (నందబాలం భజరే)

  పల్లవి
  నందబాలం భజరే నందబాలం
  బౄందావన వాసుదేవా బౄందలోలం


  చరణములు


  1.జలజ సంభవాది వినుత చరణారవిందం
  లలితమోహన రాధావదన నళిన మిళిందం


  2.నిటల లలిత స్ఫటికుటిల నీలాలక బృందం కృష్ణం
  ఘటిత శోభిత గోపికా ధర మకరందం


  3.గోదావరీ తీర రాజగోపికా రామ కృష్ణం
  ఆదిత్యవంశాబ్ది సోమం భద్రాద్రి రామం

 9. #79
  Super Moderator
  status.
   
  lakikishan's Avatar
  Join Date
  11th January 2012
  Posts
  8,961
  Rep Power
  247

  Nammina vaarini (నమ్మిన వారిని)

  Nammina vaarini (నమ్మిన వారిని)

  పల్లవి
  నమ్మిన వారిని మోసము జేసితి న్యాయము గాదుర నా తండ్రి


  అనుపల్లవి


  సమ్మత మౌనా చూచేవారికి చక్కన గాదురా రఘునాథ


  చరణములు


  1.విన్నారంటే పరులందరు నినువిడ నాడుదురే రఘునాథ
  అన్నా నీకిది చిన్నము గాదుర ఆదుగోవలేనుర రఘునాథ


  2.నిన్నానేడా నిన్ను కొలిచేది నీకే తెలియదా రఘునాథ
  ఎన్నాళ్ళకీ కష్టము పడుదును ఇక తాళనురా రఘునాథ


  3.డబ్బులకై నేను దెబ్బలు పడినది దబ్బర గాదే రఘునాథ
  నిబ్బరముగ రామదాసు నేలుమా యబ్బ తాళనురా రఘునాథ

 10. #80
  Super Moderator
  status.
   
  lakikishan's Avatar
  Join Date
  11th January 2012
  Posts
  8,961
  Rep Power
  247

  Naaraayana yanarada (నారాయణ యనరాదా)

  Naaraayana yanarada (నారాయణ యనరాదా)

  పల్లవి
  || నారాయణ యనరాదా మీ | నాలికపై ముల్లు నాటియున్నదా ||


  చరణములు


  || పనిలేని వార్తలు నూరు యట్టే | పలుమారు వాదించి పలుకుచున్నారు |
  మనమున వెతలెల్ల తీరు మీ | జననము లీడేరు జనులార మీరు ||


  || ఆలుబిడ్డలు పొందు బాసి నట్టి | అడవి లోపల పండుటాకులు మేసి |
  జాలిచెందుట వట్టిగాని | లెస్స సంసారియైయుండి సమబుద్ధిచేసి ||


  || తొడరి చిక్కులు బుట్టు తాను బుద్ధి | బొడమి నీయడు ఒక గడియైనాను |
  అడలి సంసారములోను చిక్కు | బడనేల నీబుద్ధి బంగారుగాను ||


  || కలుష వారధికి నావ నిన్ను | గలిసేటందుకు చక్కని బాట త్రోవ |
  ఇలలో తెలివికి దేవ దేవ | నరహరి రామకీర్తనములె లేవ ||


  || కామక్రోధముల చాలించి పూర్వ | కర్మ బంధములెల్ల తుదముట్టత్రెంచి |
  శ్రీమంతుడై భక్తి గాంచి | భద్రాచల రామదాసుని మదిలోన యెంచి ||

Page 8 of 16 FirstFirst 12345678910111213141516 LastLast

Thread Information

Users Browsing this Thread

There are currently 1 users browsing this thread. (0 members and 1 guests)

Members who have read this thread: 0

Bookmarks

Posting Permissions

 • You may not post new threads
 • You may not post replies
 • You may not post attachments
 • You may not edit your posts
 •