Thread: Annamacharya Keerthana Lyrics in Telugu

          
   
 1. #181
  Super Moderator
  status.
   
  lakikishan's Avatar
  Join Date
  11th January 2012
  Posts
  8,961
  Rep Power
  247

  జో అచ్యుతానంద జోజో ముకుందా Jo Achyuthananda Jojo Mukunda

  జో అచ్యుతానంద జోజో ముకుందా Jo Achyuthananda Jojo Mukunda

  By,

  MS . Subbalakshmi in Kapi


  :Sri. Balakrishnaprasad:
  :Sri.Mangalampalli Balamuralikrishna:
  :Smt.VedavathiPrabhakar ::Sri.Unnikrishnan :


  జో అచ్యుతానంద జోజో ముకుందా
  రావె పరమానంనద , రామ గోవిందా జోజో జోజో
  ...
  నందునింటనుజేరి నయముమీరంగా
  చంద్రవదనలు నీకు సేవచేయంగా
  అందముగ వారిండ్ల ఆడుచుండంగా
  మందలకు దొంగ మా ముద్దురంగా జోజో జోజో
  ...
  పాలవారాశిలో పవళించినావు,
  బాలుగా మునులుకు అభయమిచ్చినావు,
  మేలుగా వసుదేవుకుదయించినావు,
  బాలుడై ఉండి గోపాలుడైనావూ జోజో జోజో
  ...
  అట్టుగట్టిన మీగడట్టె తిన్నాడే
  పట్టి కోడలు మూతిపై రాసినాడే
  అట్టే తినెనని యత్త యడుగ విన్నాడే
  గట్టిగా నిది దొంగ కొట్టుమన్నాడే


  గొల్లవారిండ్లకు గొబ్బునకు బోయి
  కొల్లలుగా త్రావి కుండలను నేయి
  చెల్లునా మగనాండ్ర జెలిగి యీశాయీ
  చిల్లతనములు సేయ జెల్లునటవోయి


  రేపల్లె సతులెల్ల గోపంబుతోను
  గోపమ్మ మీకొడుకు మాయిండ్లలోను
  మాపుగానే వచ్చి మా మానములను
  నీ పాపడే చెరిచె నేమందుమమ్మ


  ఒకనియాలిని దెచ్చి నొకని కడబెట్టి
  జగడములు కలిపించి సతిపతుల బట్టి
  పగలు నలుజాములును బాలుడై నట్టి
  మగనాండ్ర చేపట్టి మదనుడై నట్టి
  ....
  గోవర్థనంబెల్ల గొడుగుగాగ పట్టి
  కావరమ్మున నున్న కంసు పడకొట్టి
  నీవుమధురాపురము నేల చేబట్టి
  ఠీవితో నేలిన దేవకీ పట్టి
  ....
  అంగజునిగన్న మాయన్నయిటు రారా
  బంగారుగిన్నెలో పాలుపోసేరా
  దొంగనీవని సతులు పొంగుచున్నరా
  ముంగిటానాడరా మొహనాకారా జోజో జోజో
  ....
  అంగుగా తాళ్ళాపాకనయ్య చాలా
  శృంగార రచనగా చెప్పెనీ జోల
  సంగతిగ సకల సంపదలు నీవేలా
  మంగళము తిరుపట్ల మదనగోపాలా జోజో జోజో


  Last edited by lakikishan; 21st October 2012 at 08:18.

 2. #182
  Super Moderator
  status.
   
  lakikishan's Avatar
  Join Date
  11th January 2012
  Posts
  8,961
  Rep Power
  247

  కలిగెమాకు నిది కైవల్యం Kalige maaku nidhi kaivalyam

  కలిగెమాకు నిది కైవల్యం Kalige maaku nidhi kaivalyam

  Audio/Vido link : P.Ranganath


  కలిగెమాకు నిది కైవల్యం
  కలకాలము హరికథాశ్రవణం


  అచింత్య మద్భుత మానందం
  ప్రచురం దివ్యం పావనం
  సుచరిత్రం శ్రుతిశోభితం
  అచలం బిదివో హరికీర్తనం
  నిరతం నిత్యం నిఖిల శుభకరం
  దురితం హర (దురితహరం?) భవదూరం
  పరమమంగళం భావాతీతం
  కరివరదం(?) నిజకైంకర్యం


  సులభం సుకరం శోకనాశనం
  ఫలదం లలితం భయహరణం
  కలితం శ్రీవేంకటపతిశరణం
  జలజోదరనిచ్చ స్తోత్రం  Last edited by lakikishan; 21st October 2012 at 08:23.

 3. #183
  Super Moderator
  status.
   
  lakikishan's Avatar
  Join Date
  11th January 2012
  Posts
  8,961
  Rep Power
  247

  కాలములారును గలిగె నీకునిదె Kalamu larunu galige neekunide

  కాలములారును గలిగె నీకునిదె Kalamu larunu galige neekunide


  కాలములారును గలిగె నీకునిదె
  బాలకి యందే పై పై నీకు
  సతికొప్పు విరులు జలజల రాలిన
  లతలవసంత కాలము నీకు
  కతగా తనమైకాకలు చూపిన
  అతివేసవి కాలమప్పుడే నీకు
  కాగిటిచెమటల కడు నినుఁ దడిపిన
  కాగల తొలుకరి కాలమది
  వీగని చూపుల వెన్నెల చల్లిన
  రాగినమతికి శరత్కాలంబు
  లంచపుఁబులకల లలన నీరతుల
  కంచపు హేమంత కాలమది
  యెంచగ శ్రీవెంకటెశ వలపుసతి
  వంచ శిసిరకాల వైభవమాయ
  Last edited by lakikishan; 21st October 2012 at 08:25.

 4. #184
  Super Moderator
  status.
   
  lakikishan's Avatar
  Join Date
  11th January 2012
  Posts
  8,961
  Rep Power
  247

  కొమ్మ నీ పలుకులకు కుశలమస్తు Komma nee palukulaku kusalamasthu

  కొమ్మ నీ పలుకులకు కుశలమస్తు Komma nee palukulaku kusalamasthu

  Audio link : Sri Sattiraju Venumadhav


  Explanation by Mangalampalli Kiran garu


  కొమ్మ నీ పలుకులకు కుశలమస్తు
  సమ్మదపు వయసు కైశ్వర్యమస్తు

  బెడగు కళలను చాల పెంపొందించుచున్న నీ
  యుడురాజు మోముకభ్యుదయమస్తు
  కడివోని నీరజపు కళికలను గేరు, నీ
  నెడద కుచములకు నభివృధ్ధిరస్తు

  వొగరు మిగులగ తేనె లొలుకు నున్నటి నీ
  చిగురు మోవికిని ఫల సిద్ధిరస్తు
  సొగసు చక్రములతో సొలయు నీ పిరుదులకు
  అగణిత మనోరథావ్యాప్తిరస్తు

  తనరు తుమ్మెదగములఁ దరము నీ కురులకును
  అనుపమంబైన దీర్ఘాయురస్తు
  నను ద్వారకాకృష్ణుడనుచుఁ గూడిన నీకు

  అనుదినము నిత్య కల్యాణమస్తు
  Last edited by lakikishan; 21st October 2012 at 08:26.

 5. #185
  Super Moderator
  status.
   
  lakikishan's Avatar
  Join Date
  11th January 2012
  Posts
  8,961
  Rep Power
  247

  కందువ మీ నిచ్చ కళ్యాణమునకు Kanduva mee nicha kalyanamunaku

  కందువ మీ నిచ్చ కళ్యాణమునకు Kanduva mee nicha kalyanamunaku

  Audio link : S.Janaki , composer : Balakrishnaprasad


  కందువ మీ నిచ్చ కళ్యాణమునకు
  అందములాయను అదననివి


  కలువలసేసలు కలికికి నీకును
  సొలవక చూచేటి చూపులివి
  చిలుకుల మొల్లల సేసలు మీలో
  నలుగడ ముసిముసి నవ్వులివి


  తామరసేసలు తలకొనె మీకును
  మోము మోమొరయు ముద్దు లివి
  సేమంతి సేసలు చెలీయకు నీకును
  చేమిరి గోళ్ళ చెనకు లివి


  సంపెంగ సేసలు సమరతి మీకును
  ముంపుల వూర్పుల మూకలివి
  యింపుల శ్రీవేంకటేశ చెలిగలసి
  సంపదఁ దేలితి చనవులివి


  Last edited by lakikishan; 21st October 2012 at 08:28.

 6. #186
  Super Moderator
  status.
   
  lakikishan's Avatar
  Join Date
  11th January 2012
  Posts
  8,961
  Rep Power
  247

  కోరిన కోరికలెల్ల కొమ్మయందే కలిగీని Korina korikalella komma yand

  కోరిన కోరికలెల్ల కొమ్మయందే కలిగీని Korina korikalella komma yande kaligeeni

  Audio link : Sri Balakrishnaprasad


  కోరిన కోరికలెల్ల కొమ్మయందే కలిగీని
  చేరి కామయజ్ఞ మిట్టే సేయవయ్యా నీవు


  సుదతిమోవి తేనెలు సోమపానము నీకు
  పొదుపైన తమ్ములము పురోడాశము
  మదన పరిభాషలు మంచి వేద మంత్రములు
  అదె కామయజ్ఞము సేయవయ్యా నీవు


  కలికి పయ్యద నీకు కప్పిన కృష్ణాజినము
  నలువైన గుబ్బలు కనక పాత్రలు
  కలసేటి సరసాలు కర్మ తంత్ర విభవాలు
  చెలగి కామయజ్ఞము సేయవయ్యా నీవు


  కామిని కాగిలి నీకు ఘనమైన యాగశాల
  ఆముకొన్న చెమటలే యవబృథము
  యీమేరనే శ్రీవేంకటేశ నన్ను నేలితి
  చేముంచి కామ యజ్ఞము సేయవయ్యా నీవు

  Last edited by lakikishan; 21st October 2012 at 08:30.

 7. #187
  Super Moderator
  status.
   
  lakikishan's Avatar
  Join Date
  11th January 2012
  Posts
  8,961
  Rep Power
  247

  కొలువరో మొక్కరో కోరిన వరము లిచ్చీ Koluvaro mokkaro korina varamu lichi

  కొలువరో మొక్కరో కోరిన వరము లిచ్చీ Koluvaro mokkaro korina varamu lichi

  Audio link : Sri Balakrishnaprasad


  కొలువరో మొక్కరో కోరిన వరము లిచ్చీ
  సులభు డిన్నిటాను వీడె సుగ్రీవ నరహరి ||


  కంబములోన పుట్టి కనకదైత్యుని కొట్టి
  అంబరపు దేవతలకు అభయమిచ్చి |
  పంబి సిరిదన తొడపై బెట్టుక మాటలాడి
  అంబుజాక్షుడైనట్టి ఆదిమ నరహరి ||


  నానా భూషణములు ఉన్నతి తోడ నిడుకొని
  పూనికతో ప్రహ్లాదుని బుజ్జగించి
  మానవులకెల్లను మన్నన చాలా నొసగి
  ఆనందముతో నున్నాడు అదిగో నరహరి ||


  మిక్కిలి ప్రతాపముతో మించిన కాంతులతోడ
  అక్కజపు మహిమల నలరుచును
  తక్కక శ్రీవేంకటాద్రి తావుకొని వరాలిచ్చీ
  చక్కదనములకెల్లా చక్కని నరహరి ||

  Last edited by lakikishan; 21st October 2012 at 08:32.

 8. #188
  Super Moderator
  status.
   
  lakikishan's Avatar
  Join Date
  11th January 2012
  Posts
  8,961
  Rep Power
  247

  కొండవంటి దేవుడు నేగొలిచే దేవుడు వీడే Kondavanti devudu neg

  కొండవంటి దేవుడు నేగొలిచే దేవుడు వీడే Kondavanti devudu negoliche devudu veede

  Audio link : Smitha Madhav, ragamalika


  కొండవంటి దేవుడు నేగొలిచే దేవుడు వీడే
  నిండుకున్నాడు తలచు నెమ్మదినోమనసా


  నన్నుఁ బుట్టించే దేవుడు నాలోనున్నాడు దేవుడు
  కన్నచోటులనే వుండే కాచే దేవుడు
  వెన్నతోఁబెంచే దేవుడు వివేకమిచ్చే దేవుడు
  యెన్నని పొగడవచ్చు యీతడే మా దేవుడు


  సిరులిచ్చిన దేవుడు సేవగొనేటి దేవుడు
  గురుడై బోధించి చేకొన్న దేవుడు
  మరిగించిన దేవుడు మాటలాడించే దేవుడు
  ఇరవై మాయింటనున్నాడీ దేవుడు


  దాపుదండైన దేవుడు దరిచేర్చిన దేవుడు
  రూపు చూపె నిదివో బోరున దేవుడు
  శ్రీపతియైన దేవుడు శ్రీవేంకటాద్రి దేవుడు
  చేపట్టి మమ్మేలినాడు చేచేతనే దేవుడు

  Last edited by lakikishan; 21st October 2012 at 08:33.

 9. #189
  Super Moderator
  status.
   
  lakikishan's Avatar
  Join Date
  11th January 2012
  Posts
  8,961
  Rep Power
  247

  కొసరనేల నా గుణములివి Kosaranela naa gunamulivi

  కొసరనేల నా గుణములివి Kosaranela naa gunamulivi

  Audio link : Smitha Madhav, in Hindolam.


  కొసరనేల నా గుణములివి
  రసికత నీ విన్నిటా రక్షించుకొనుమా||


  నేరమి నాది నేరుపునీదే
  దూరు నాది బంధుడవు నీవు
  కోరుదు నేను కొమ్మని యిత్తువు
  కారుణ్యాత్మక గతి నీవు సుమా ||


  నేను యాచకుడ నీవే దాతవు
  దీనుడ నే బరదేవుడవు
  జ్ఞానరహితుడను సర్వజ్ఞనిధివి
  శ్రీనిధి యిక ననుజేరి కావుమా ||


  అరయ నే జీవుడ నంతర్యామివి
  యిరవుగ దాసుడ నేలికవు
  చిరజీవిని నే శ్రీ వేంకటపతివి
  వరదుడ నను జేవదలకుమా ||


  Last edited by lakikishan; 21st October 2012 at 08:35.

 10. #190
  Super Moderator
  status.
   
  lakikishan's Avatar
  Join Date
  11th January 2012
  Posts
  8,961
  Rep Power
  247

  కుందనపు పిల్లఁగ్రోవి గోపినాథా Kundanapu pillamgrovi gopinatha

  కుందనపు పిల్లఁగ్రోవి గోపినాథా Kundanapu pillamgrovi gopinatha

  Audio link : Sri Mohana Krishna


  కుందనపు పిల్లఁగ్రోవి గోపినాథా ! మాపై
  చిందేవు మోహరసాలు చిన్ని గోపినాథా


  కొలనిలోపలిమాతో గోపినాథా ! యేల
  కులికినవ్వు నవ్వేవు గోపినాథా
  కొలువు మొక్కు మొక్కేము గోపినాథా ! నీ
  చలము చెల్లితేఁ జాలు జాణ గోపినాథా


  గొబ్బన మాచీరలిమ్ము గోపినాథా ! మా
  గుబ్బలపైఁ గాక రేగె గోపినాథా
  గుబ్బతిల్లీ తమకమే గోపినాథా నీ
  కబ్బితి మేమైన చేయవయ్య గోపినాథా


  కుప్పవడె మాసిగ్గు గోపినాథా ! మా
  కొప్పు జారె ముడువుమా గోపినాథా
  వొప్పుగ శ్రీవేంకటాద్రి నుండి వచ్చి కూడితివి
  అప్ప తొండమారేగుళ్ళా ఆది గోపినాథా

  Last edited by lakikishan; 21st October 2012 at 08:36.

Page 19 of 81 FirstFirst 123456789101112131415161718192021222324252627282930313233343536373869 ... LastLast

Thread Information

Users Browsing this Thread

There are currently 2 users browsing this thread. (0 members and 2 guests)

Members who have read this thread: 1

Bookmarks

Posting Permissions

 • You may not post new threads
 • You may not post replies
 • You may not post attachments
 • You may not edit your posts
 •